పిడుగుపాటుకు గురైన విద్యార్థులు.. వీడియో వైరల్

71చూసినవారు
యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. యూపీ,బీహార్‌తో పాటు ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. వర్షం ధాటికి పలువురు విద్యార్థులు మురాదాబాద్ తీర్థంకర మహావీర్ విశ్వవిద్యాలయంలో చెట్టు కింద నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో ఐదుగురు విద్యార్థులు షాక్‌కు గురై కిందపడిపోయారు. ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పిడుగు పడే దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్