రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే, పూత పూయని రకాలు లేదా 7-8 నెలల వయస్సు గల లేత తోటల నుంచి విత్తనాన్ని సేకరించాలి. నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతంలో ఈ సమస్యను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. చీడపీడలు, తెగుళ్లు ఆశించనటువంటి ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరకు గడపైన ఉన్న మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి.