TG: ములుగు జిల్లా బుట్టాయిగూడేనికి చెందిన నాగయ్య ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనలో చోద్యం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అతని ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిందన్నారు. ఇది కాంగ్రెస్ హత్యేనని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.