ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం?

59చూసినవారు
ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం?
ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇనాంగూడలో బుధవారం ఉదయం జరిగింది. బీఎన్.రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ తన ముగ్గురు పిల్లలతో కారులో వెళ్లూ ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లాడు. గమనించిన స్థానికులు వెంటనే కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్