నిజానికి గెలుపోటములు తాత్కాలికమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీకటి రాత్రి అలాగే శాశ్వతంగా ఉండిపోదు. దాని వెంట వెలుగూ వస్తుంది. వైఫల్యానికి కారణాలను తెలుసుకుని మధ్యంతర పరీక్షలకు సిద్ధంకావాలి. మంచి మార్కులు తెచ్చుకున్న నేస్తాలను కలిసి పరీక్ష రాయడంలోని కొన్ని మెలకువలనూ నేర్చుకోవచ్చు. వారి సహాయంతో ఈసారి బాగా రాసి విజయం సాధించవచ్చు. మనమంటూ జీవించి ఉంటే... ఈరోజుకాక పోతే రేపు విజయం మన బానిస అవుతుంది.