విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ ఆర్సీబీ మ్యాచ్ అనంతరం విరాట్ కామెంటేటర్ ను విమర్శించిన సంగతి తెలిసిందే. దానిపై గవాస్కర్ స్పందించారు. 'బయటి వ్యాఖ్యల్ని మేం పట్టించుకోం అంటారు కదా? అలాంటప్పుడు మా వ్యాఖ్యలపై ఎందుకు స్పందిస్తున్నారు? మేమంతా క్రికెట్ ఆడాం. ఇక్కడ మా ఇష్టాయిష్టాలతో మాట్లాడం. ఏం కనిపిస్తుందో దాని గురించే చెబుతాం' అని పేర్కొన్నారు.