అంతరిక్షంలోనే ఏడు నెలలుగా శూన్యంతో సునీతా విలియమ్స్ పోరాటం చేస్తున్నారు. గతేడాది జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి సునీతా, బుచ్ విల్ మోర్ వెళ్లారు. జూన్ 14నే తిరుగుపయనం కావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సాయం కోరినట్లు ‘స్పేస్ ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. త్వరలో ఈ పని పూర్తిచేస్తామని ‘X’లో పోస్టు పెట్టారు.