TG: సుంకిశాల పంప్ హౌజ్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద నివేదిక వివరాలను ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమన్నారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం ఏంటని ప్రశ్నించారు.