AP: ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రెక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.