మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ మహనీయుడికి నివాళులు అర్పించి మాట్లాడారు. రాళ్లవాగు నుంచి గోదావరి పరిసరాలు ముంపునకు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని.. ఇందుకు కావలసిన రూ. 260 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు.