అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. చేతులతో మైనర్‌ను వేధించడం, పైజామా విప్పడం లాంటి చర్యలు అత్యాచారం యత్నం కిందకు రావు అని అలహాబాద్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వగా దానిని తప్పుపట్టింది. అలాగే ఓ కేసు విషయంలో అత్యాచారం బాధితురాలిని హైకోర్టు తప్పుబట్టగా సుప్రీంకోర్టు ఖండించింది. తీర్పులు ఇచ్చే సమయంలో జడ్జీలు అనుచిత వ్యాఖ్యలు చేయరాదని సూచించింది.