TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీం కోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తెలిసిందని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుల్‌డోజర్లతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు. విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ విషయం అని అన్నారు.