వివాహ బంధంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్యాభర్తల బంధం అనేది పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో దంపతులు ఇవేమీ లేకుండా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి మధ్య విరోధాలు కనిపిస్తున్న నేపథ్యంలో బంధాన్ని పునరుద్ధరించే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది’’ అని పేర్కొంది.