షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో ఉప వర్గీకరణ అనుమతించదగినదేనా? అనే అంశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు చెప్పబోతున్నది. 3 రోజులపాటు వాదనలను విన్న తర్వాత తీర్పును ఫిబ్రవరి 8న వాయిదా చేసిన సంగతి తెలిసిందే. స్టేట్ ఆఫ్ పంజాబ్ vs దవిందర్ సింగ్ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి 2020లో నివేదించింది.