టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో రానున్న తమిళ మూవీతో అరంగ్రేటం చేయనున్నాడు. దీనికి లోగాన్ దర్శకత్వంలో డ్రీమ్ నైట్ స్టోరీస్ నిర్మాణసంస్థ కింద శ్రవణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో రైనా ఎంట్రీ గురించి డీకేఎస్ అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ అభిమానులు మిస్టర్ ఐపీఎల్, చిన్నతలాగా పిల్చుకునే రైనాకు తమళనాడుతో ప్రత్యేక అనుబంధం ఉంది.