అల్లు అర్జున్ 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి 'పుష్ప-2' మూవీ మాత్రమే గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. రీలోడెడ్ త్వరలో రిలీజ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. కానీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ 23 నిమిషాలు కలిపిన రీలోడెడ్ వెర్షన్ను స్ట్రీమింగ్ చేస్తోంది. ఇది తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళంలో అందుబాటులో ఉంది.