అడవి భూమి అని ప్రధాని అనడం ఆశ్చర్యం కలిగించింది: శ్రీధర్ బాబు

56చూసినవారు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. అడవి కాని భూమిని అడవి అని ఒక ప్రధాని అనడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మోదీకి అలా తప్పుడు సమాచారం ఇచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలది కూడా ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. 'ఇప్పటికీ చెప్తున్నా అటవీ ప్రాంతంలో ఆ భూమి లేదు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది, మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. AIని వినియోగించి విష ప్రచారం చేసిన BRS, BJPలకు సమాధానం చెప్తాం' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్