సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేశాఖకు ఉంది: హైకోర్టు

77చూసినవారు
సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేశాఖకు ఉంది: హైకోర్టు
తెలంగాణ రెవెన్యూ చట్టం, సర్వే, సరిహద్దుల చట్టం ప్రకారం సర్వే నిర్వహించి సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వే శాఖకు ఉందని హైకోర్టు పేర్కొంది. "అయితే ఈ చట్టాల కింద జారీ అయిన పలు సర్క్యులర్ల ప్రకారం నిర్దిష్ట గడువులోగా సర్వే పూర్తి చేయాల్సి ఉంది. సర్వే నిర్వహించి భూమి హద్దులను గుర్తించడానికిగాను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన దరఖాస్తులపై నిర్దిష్ట గడువులోగా సర్వే నిర్వహించాల్సి ఉంది" అని హైకోర్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్