గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండలం పాటిమట్టలో జరిగింది. నాగపూర్ నరసయ్య (70) అనే రైతు గేదెను మేతకు తీసుకెళ్లాడు. గేదే మెడకు ఉన్న పగ్గాన్ని(తాడు) చేతికి కట్టుకున్నాడు. ఒక్కసారిగా చెరువులోకి లాక్కెళ్లడంతో నీటి మునిగి చనిపోయాడు. నరసయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.