నీళ్లు ఇవ్వమని అడిగిన రైతులతో ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఆలేరు మండలం కొలనుపాకలో సాగునీరు కావాలని అడిగిన రైతులతో.. 'బీఆర్‌ఎస్ వాళ్లు మీటింగ్స్‌లలో తాము నీళ్లు ఇవ్వడంలేదని చెబుతున్నారుగా ఎక్కడి నుండి ఇవ్వాలని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. చెరువులు నింపాలని రైతులు కోరారు. ఎమ్మెల్యే వారిని వారించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.