భువనగిరి: చిన్నారి ప్రాణం తీసిన అతివేగం

56చూసినవారు
భువనగిరి హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఆ చిన్నారి స్పాట్ లో మృతి చెందాడు. సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాలుడి తండ్రి వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని కారు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్