భువనగిరి పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముదుంపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ మృతి చెందారు. భర్త సత్యనారాయణతో లూనా పై వెళ్తుండగా, జంఖాన్ గూడ చౌరస్తా వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొంది. మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, సత్యనారాయణకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.