యాదాద్రి: ట్రాక్టర్ బోల్తా.. వృద్ధురాలు మృతి

63చూసినవారు
యాదాద్రి: ట్రాక్టర్ బోల్తా.. వృద్ధురాలు మృతి
యాదాద్రి జిల్లా గుండాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు వివరాల ప్రకారం.. పెద్ద పడిశాల గ్రామానికి చెందిన గైగులరామక్క ఒక ఫంక్షన్ నిమిత్తం దేవరప్పులకు ట్రాక్టర్‌లో వెళ్తుంది. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో వృద్ధురాలు కిందపడి స్పాట్‌లోనే మృతి చెందింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

సంబంధిత పోస్ట్