నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శుక్రవారం ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు బీరువా తాళాలు పగుల గొట్టి నాలుగు తులాల బంగారం, రెండు లక్షల నగదు అపహరించుకుపోయారు. పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.