దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10: 30 అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పిస్తారు. 12 గంటలకు వద్దిపట్లలో బాబా సాహెబ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.