నేరేడుగొమ్ము: సాగర్ బ్యాక్ వాటర్ లో యువకుడు గల్లంతు

209చూసినవారు
నేరేడుగొమ్ము: సాగర్ బ్యాక్ వాటర్ లో యువకుడు గల్లంతు
నేరేడుగొమ్ము మండల పరిధిలోని వైజాగ్ కాలనీ సాగర్ బ్యాక్ వాటర్ కు విహారయాత్ర కోసం వచ్చిన యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. హైదరాబాద్ లింగంపల్లికి చెందిన అనిల్ అనే యువకుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాక్ వాటర్ లోకి స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి యువకుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్