సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు గ్రామస్తుల నుండి అపూర్వ స్పందన లభించింది. సదస్సులో మొత్తం 549 దరఖాస్తులు సమర్పించబడినట్లు ఎమ్మార్వో సురేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇది ఇప్పటివరకు వచ్చిన అత్యధిక దరఖాస్తుల సంఖ్యగా గుర్తించబడిందన్నారు.