చింతలపాలెం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, అన్ని పార్టీల ప్రతినిధులు, పత్రికా విలేకరులు, అంబేద్కర్ యువజన సంఘం, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.