దొండపాడు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో బుక్స్, స్కూల్ యూనిఫామ్ గురువారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి, సీనియర్ నాయకులు గోపిరెడ్డి పుల్లారెడ్డి, దొండపాడు గ్రామం మాజీ ఉప సర్పంచ్, మధిర వెంకటరెడ్డి, మండల ఐఎన్టీయూసీ అధ్యక్షులు చింతిరాల రవీందర్, స్కూల్ ప్రిన్సిపాల్, స్టాప్, తదితరులు పాల్గొన్నారు.