ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని కోదాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 16వ తేదీ శుక్రవారం కోదాడలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.