గరిడేపల్లి మండల కేంద్రంలో గారకుంట తండా వద్ద సాగరకాల్వపై వంతెన నిర్మించాలని సిపిఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సాగర్ కాలువపై వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని అన్నారు. గతంలో గునాలు వేశారని అలా కాకుండా వంతెన నిర్మిస్తే శాశ్వతంగా ఉంటుందన్నారు రెండు వరుసల రహదారి వేస్తున్నందున అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకటేశ్వర్లు సాంబయ్య శంకర్ పాల్గొన్నారు