మేళ్లచెరువు మండల పరిధిలోని కందిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు షేక్ జాఫర్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు ఎంపికయ్యారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈనెల 30 నుండి డిసెంబర్ 3 వరకు జరిగే సైన్స్ ఫెస్టివల్ లో ఆయన రాష్ట్రం పక్షాన పాల్గొననున్నారు. జాఫర్ ఎంపిక పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోదాడ హుజూర్ నగర్ డివిజన్ ఎంఈఓలు, ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.