

భర్తను కలిసేందుకు వెళ్తూ నవ వధువు మృతి (వీడియో)
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌లోని అరాబా గ్రామానికి చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్(20) మరణించారు. ఆమె భర్త మన్పూల్ సింగ్ లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగింది. పెళ్లైన వెంటనే భర్త లండన్ వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం ఆమెకు వీసా రావడంతో భర్తను కలిసేందుకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్తూ.. ప్రాణాలు విడిచారు. ఇంటి నుంచి వెళ్తున్న ఆమెకు కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికిన వీడియో వైరల్ అవుతోంది.