గరిడేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యా శాఖాధికారి అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. పాఠశాల ప్రారంభమైన తొలి రోజున ప్రార్ధనా సమయానికి డీఈఓ పాఠశాలకు హాజరు కావడం గమనార్హం. కాగా ఉపాధ్యాయుల, విద్యార్ధుల హాజరును పరిశీలించారు. విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.