విద్యార్థు ల్లో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి కి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎండి జాఫర్ పిలుపునిచ్చారు. బుధవారం చింతలపాలెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. జే వి వి బాధ్యులు మండల వ్యాప్తంగా విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలన్నారు.