
భారత్‌లో హాకీ ఆసియా కప్.. పాకిస్థాన్ ఆడుతుందా?
భారత్‌లోని రాజర్, బిహార్‌లో హాకీ ఆసియా కప్ 12వ ఎడిషన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ జట్టు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఈ టోర్నీలో ఆ జట్టును అనుమతించే విషయంపై కేంద్రం ఆదేశాలను అనుసరిస్తామని హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోలనాథ్ వెల్లడించారు. కాగా, ఈ టోర్నీలో విన్ అయిన జట్టు వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఆడే ఛాన్స్ ఉంటుంది.