కార్మికులకు అండగా ఐఎన్టీయూసీ ఉంటుందని ఆ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య అన్నారు. శనివారం హుజూర్నగర్ లో ఆర్ బాయిల్ రైస్ మిల్లర్స్ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో మాట్లాడారు. యాజమాన్యంతో కుదిరిన నూతన అగ్రిమెంట్ లో చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మేకపోతుల వీరబాబు, కాకిలేటి సుబ్బారావు, సోమ గాని బాలకృష్ణ, ప్రసాద్ ఉన్నారు.