హుజూర్ నగర్ న్యాయస్థానంలో ఈ నెల 14న జరిగే లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయవాదులు కృషి చేయాలని ఇన్చార్జి జూనియర్ సివిల్ జడ్జి భవ్య అన్నారు. గురువారం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కేసుల రాజీతో జరిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జక్కుల నాగేశ్వరరావు ఉన్నారు.