హుజూర్‌నగర్ మండలంలోని పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా వాతావరణంలోని మార్పుల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడం వల్ల అగ్గి తెగులు వృద్ధి పెరిగిందన్నారు. తెగులు నివారణ చేపట్టాల్సిన చర్యలను సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, రైతులు పాల్గొన్నారు.