
జూన్లో చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా
ఏపీలో చేనేత కార్మికుల కోసం ఆరోగ్య బీమాను జూన్లో అమలు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని, త్వరలో చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దసరా నాటికి చేనేత సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.