

నా కుర్చీకే ఎసరు పెట్టావా.. చిన్నారితో సీఎం (వీడియో)
AP: సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లిలో చంద్రబాబు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఓ ఇంటికి వెళ్లినప్పుడు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఓ పాపను దగ్గరికి పిలిచి ‘పెద్దయ్యాక ఏమవుతావమ్మా’ అని చంద్రబాబు అడిగారు. ఆ చిన్నారి ‘సీఎం అవుతాను’ అని చెప్పింది. దాంతో సీఎం చంద్రబాబు ఒక్కింత ఆశ్చర్యపోయారు. చంద్రబాబు పాపను దగ్గరికి తీసుకుని నవ్వుతూ.. ‘నా కుర్చీకే ఎసరు పెట్టావా? గుడ్’ అని అన్నారు.