హుజూర్ నగర్ మున్సిపల్ మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మంగళవారం సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో స్మశాన వాటిక వరకు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన డప్పు కొట్టి నివాళులర్పించారు. గౌడ సంఘం అధ్యక్షులు వల్లపు దాసు కృష్ణ, షేక్ రసూల్, రజా అలీ బాబా జానీ అక్బర్ , భాష, షేక్ ఇబ్రహీం ఉన్నారు.