
జీతాలు వెనక్కి ఇవ్వాలని లెక్చరర్లకు నోటీసులు!
AP: 2019లో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు తీసుకున్న 2 నెలల జీతాన్ని వెనక్కి ఇవ్వాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల తరహాలో తమకు జీతాలివ్వాలని డిగ్రీ కాలేజీ లెక్చరర్లు విన్నవించారు. అప్పుడు రాష్ట్రంలోని 600 మందికి ఏప్రిల్, మే నెలలకు గానూ 51 రోజుల జీతాలు అందాయి. ఇలా తీసుకుంటే దాన్ని అదనంగా పరిగణించి జీతాలు వెనక్కి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.