మఠంపల్లి నుండి హైదరాబాద్ కు ఎక్స్ ప్రెస్ ను తిరిగి నడపాలని గ్రామస్తులు కోరుతున్నారు. 50 ఏళ్ళ క్రితమే హైదరాబాద్ కు ఎక్స్ ప్రెస్ బస్సు వుందని 5 సంవత్సరాల నుండి ఎక్స్ ప్రెస్ బస్సును రద్దు చేసారని వాపోయారు. బస్సు లేక పోవడం లో హైద్రాబాద్ నగరానికి పనుల నిమిత్తం వెళ్ళడం ఇబ్బంది గా మారిందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి ఆర్టీసీ అధికారులు ఎక్స్ ప్రెస్ బస్సు ను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.