హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నవనీత(27) అనే మహిళ మఠంపల్లి పరిధిలోని రఘునాథపాలెం గ్రామంలో ఇంటి స్లాబ్ వేసేందుకు కూలీ పనికి వెళ్లి తిరిగి ట్రాక్టర్ పై వస్తున్న క్రమంలో టర్నింగ్ రావడంతో డ్రైవర్ కటింగ్ ఇవ్వగా, ట్రాక్టర్ అదుపుతప్పింది. దీనితో ట్రాక్టర్ పై ఉన్న నవనీత జారి పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినది.