అనంతగిరి మండలంలోని గొండ్రియాల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు బడి బాట షెడ్యుల్ లో భాగంగా సాముహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో తల్లాడ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్ధులకు ఆసక్తి కరమైన ఆట, పాటతో కూడిన విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్ సుధాకర్, ఉపాధ్యాయులు ఉన్నారు.