నేడు కోదాడలో దివ్యాంగుల క్యాంప్, ఉపకరణాలకు దరఖాస్తు స్వీకరణ

81చూసినవారు
నేడు కోదాడలో దివ్యాంగుల క్యాంప్, ఉపకరణాలకు దరఖాస్తు స్వీకరణ
సూర్యాపేట జిల్లా కోదాడ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ అలీంకో సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సహాయక పరికరాల కోసం గురువారం నిర్వహించే క్యాంపులో దివ్యాంగుల నుండి దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా వికలాంగుల శాఖ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపులో దరఖాస్తు చేసుకొనే దివ్యాంగులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యుడిఐడి కార్డు, తహసీల్దార్ జారిచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగత్వం కనిపించే పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు తప్పనిసరిగా తీసుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్