ఆర్ఎంపి, పిఎంపీలపై దాడులు నిలిపివేయాలి

81చూసినవారు
ఆర్ఎంపి, పిఎంపీలపై దాడులు నిలిపివేయాలి
ఆర్ఎంపి, పిఎంపీలపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్, ఎన్ఎంసీ అధికారుల దాడులను ప్రభుత్వం నిలిపివేయాలని ఆర్ఎంపీల సంఘం కోదాడ మండల అధ్యక్షులు భూతం శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం కోదాడలో ఆర్ఎంపీ, పిఎంపీల సంఘ సమావేశంలో మాట్లాడారు. పేదలకు ప్రధమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతున్న ఆర్ఎంపీ వైద్యులపై దాడులు చేయటం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వైద్య సేవలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్