కోదాడ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ పి యాదగిరి, బిల్ కలెక్టర్లు టి శివప్రసాద్, రంగాచారి, అనంతలక్ష్మి, స్వీపర్ కొమ్ము నాగేశ్వరరావు, ట్రాక్టర్ డ్రైవర్ పాషా లు ఉత్తమ ఉద్యోగుల పురస్కారానికి ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, కమిషనర్ రమాదేవి, పాలకవర్గ సభ్యులు, అధికారులు అభినందించారు.