గిరిజన సంస్కృతి కి శీతల పండుగ ప్రతీక

70చూసినవారు
గిరిజన సంస్కృతి కి శీతల పండుగ ప్రతీక
మునగాల మండలం శ్రీనివాస్ నగర్ తండా లో మంగళవారం శీతల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు గంపలతో నైవేద్యాలు తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ పరంగా తండా లో ఊరేగింపు నిర్వహించారు. గిరిజన సంస్కృతి కి శీతల పండుగ ప్రతీకగా చెబుతుంటారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు కలిగి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు పురుషులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్